ఎలా చదువుకోవాలి
పది నెలలు పూర్తవుతు న్నా ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోతే మేము ఉన్నత వి ద్య ఎలా చదువుకోవాలి. కళాశాలకు వెళితే ఫీ జుల పేరుతో వేధిస్తారు. కూలీ పనులు చేసు కునే తల్లిదండ్రులు ఒక్కసారిగా రూ.వేలల్లో ఫీజులు చెల్లించాలంటే ఎలా సాధ్యపడుతుంది. ఉన్నత విద్య చదువుకునే మాపై కూటమి టీడీపీ కక్ష సాధింపులకు పాల్పడుతోంది.
–తోటి ఆనందరావు, శ్రీరంగరాజపురం మండలం
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కూటమి టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నేను సివిల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్నాను. గత ఐదేళ్లల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఎలాంటి సమస్యలుండేవి కావు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తావనే లేదు. ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. పేద విద్యార్థులపై చిన్నచూపు సబబు కాదు. – భానుప్రకాష్, విద్యార్థి,
బంగారుపాళెం మండలం
జిల్లాలోని కళాశాలల సమాచారం డిగ్రీ కళాశాలలు : 116 ఇంజినీ