మా సమస్యలు పరిష్కరించండి సారూ! | - | Sakshi
Sakshi News home page

మా సమస్యలు పరిష్కరించండి సారూ!

Feb 11 2025 1:49 AM | Updated on Feb 11 2025 1:49 AM

మా సమస్యలు పరిష్కరించండి సారూ!

మా సమస్యలు పరిష్కరించండి సారూ!

● కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు ● వివిధ సమస్యలపై 253 అర్జీలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : తమ సమస్యల పరిష్కారం కోసం విన్నపాలు ఇస్తూనే ఉన్నాం.. అయితే పరిష్కారానికి నోచుకోవడం లేదు.. తమ వినతు లు విని, సమస్యలు పరిష్కరించండి సారూ.. అని ప్రజలు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అధిక సంఖ్యలో వినతులను అందజేశారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్‌ హిమవంశీ, డీఆర్వో మోహన్‌కుమార్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 253 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. ప్రజలు అందజేసే వినతులకు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement