
అరగొండలో ఇంకుడు గుంతలను పరిశీలిస్తున్న సభ్యులు
తవణంపల్లె: అరగొండలో స్వచ్ఛత కార్యక్రమంలో తవ్విన ఇంకుడు గుంతలను పరిశీలించి కేంద్ర ఉద్యోగుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీర్లుగా ఎంపికై న ఉద్యోగుల బృందం శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండల కేంద్రంలోని మహిళా చేయూత మార్ట్‌ను పరిశీలించారు. ఉపాధి పనులను పరిశీలించారు. ముందుగా మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలా చర్చ జరుగుతుందో ఎమ్మెల్యే ఎంఎస్.బాబును అడిగి తెలుసుకున్నారు. అరగొండలో డంపింగ్ యార్డును పరిశీలించారు. సచివాలయాల పనితీరు, డ్వాక్రా సంఘాల నిర్వహణపై ఆరా తీశారు. బృందం సభ్యులు సత్యంగౌహాన్, షయాలిప్రియదర్స్, అంకితసిన్హా, దేరజ్‌కుమార్, శషాక్‌జైన్, సౌరబ్‌మీనా, కోఆర్డినేటర్లు హనుమంతు రావు, యాదమరి ఈఓపీఆర్‌డీ హరిప్రసాద్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.