
ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసి డబ్బు దోచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి, అధికారులు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ యువతి మాత్రం స్కామ్ చేసి మోసం చేద్దామన్న వ్యక్తికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. ఓ యువతికి స్కామర్ ఫోన్ చేసి, తాను తన తండ్రి ఫ్రెండ్ అని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ యువతి చాలా గౌరవంగా నమస్తే అంకుల్ అంటూ మాట కలిపింది. నేను (స్కామర్) మీ తండ్రికి రూ. 12000 ఇవ్వాలి. ఆ మొత్తాన్ని పంపిస్తున్నా అని చెప్పాడు. నెంబర్ కన్ఫర్మ్ చేసుకుని.. మొదటి 10 రూపాయలు పంపినట్లు టెక్స్ట్ మెసేజ్ చేసాడు.
పది రూపాయలు వచ్చాయి అంకుల్ అని.. ఆ యువతి అమాయకంగా సమాధానం చెప్పింది. ఆ తరువాత మరో రూ.12000 పంపిస్తున్నా అంటూ 10,000 రూపాయలు పంపినట్లు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ చేసాడు. రూ. 10వేలు కూడా వచ్చాయని యువతి చెప్పడంతో.. మరో రూ. 2000 పంపిస్తున్న అని చెప్పి.. రూ. 20000 పంపినట్లు మెసేజ్ చేసాడు.
అయ్యో అంకుల్ మీరు రూ. 2000 పంపిస్తున్నా అని.. రూ. 20000 పంపించేశారు అని యువతి చెప్పింది. అరెరే.. అనుకోకుండా పొరపాటు జరిగిందంటూ స్కామర్ నటిస్తూ.. రూ. 2000 ఉంచుకుని మిగిలిన రూ. 18000 తనకు యూపీఐ యాప్ ద్వారా పంపాలని చెప్పాడు. ముందే అది స్కామ్ అని గ్రహించిన యువతి.. స్కామర్ పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసి.. రూ. 20వేలు దగ్గర.. రూ. 18000 అని టైప్ చేసి.. అదే నెంబరుకు టెక్స్ మెసేజ్ చేసి.. అంకుల్ మీ అమౌంట్ తిరిగి పంపించేసాను చూసుకోండి అని చెప్పింది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!.. వీడియో
ఆ యువతి చేసిన పనికి స్కామర్.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. చేసేదేమీ లేక స్కామర్ ఊరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ యువతి తెలివిని తెగ పొగిడేస్తున్నారు. స్కామర్ల పని పట్టాలంటే.. ఇలాంటి వారే కరెక్ట్ అని కొందరు చెబుతున్నారు.
Kalesh prevented by girl while talking to Scammer pic.twitter.com/d8sNRwjASy
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 13, 2025