‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్‌ క్రికెట్‌ పిచ్చి’ | Work schedule changed based on cricket matches, father of late EY employee | Sakshi
Sakshi News home page

‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్‌ క్రికెట్‌ పిచ్చి’

Sep 22 2024 2:31 PM | Updated on Sep 22 2024 3:07 PM

Work schedule changed based on cricket matches, father of late EY employee

యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్‌ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు.

"ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.

నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.

అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement