హైదరాబాద్: నగరంలోని ప్రముఖ వినోద కేంద్రం 'వండర్‌లా హైదరాబాద్' 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016లో ప్రారంభమైన ఈ అమ్యూస్‌మెంట్ పార్కు, గడిచిన దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో 68 లక్షల మందికి పైగా సందర్శకులను ఆకర్షించడమే కాకుండా.. ఏకంగా 13.6 కోట్ల రైడ్ అనుభవాలను అందించింది. 31 ఎకరాల నుంచి 50 ఎకరాలకు విస్తరించిన వండర్‌లా, రైడ్ల సంఖ్యను 42 నుండి 51కి పెంచింది.
ఈ దశాబ్ది ఉత్సవాలు, వేసవి సీజన్‌ను పురస్కరించుకుని జూన్ 14 వరకు ఆన్‌లైన్ బుకింగ్స్‌పై వండర్‌లా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టిక్కెట్లపై 31% వరకు, టికెట్-ప్లస్-బఫే కాంబోలపై 33% వరకు ప్రత్యేక తగ్గింపులు ఇస్తోంది. వారపు రోజుల్లో రూ.1,219, వీకెండ్స్‌లో రూ.1,249 ప్రారంభ ధరలతో (పన్నులు అదనం) ఇవి లభిస్తాయి. అంతేకాదు, వండర్లా ప్రారంభమైన 2016 సంవత్సరంలో జన్మించిన పిల్లలకు వయోపరిమితి గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
వండర్‌లా హైదరాబాద్ సంస్కృతిలోనూ భాగమైంది. బతుకమ్మ, సంక్రాంతి, రంజాన్ వంటి పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో ఇక్కడికి వచ్చిన వారు ఏకంగా 750 టన్నుల బిర్యానీని ఆస్వాదించడం విశేషం. ఏటా 2,600 పాఠశాలలు, 1,100 కార్పొరేట్ ఈవెంట్లకు ఇది ఆతిథ్యమిస్తోంది.


