ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! | When Northrop Grumman Manta Ray Prototype Video | Sakshi
Sakshi News home page

ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు!

Jun 16 2024 10:59 AM | Updated on Jun 16 2024 12:09 PM

When Northrop Grumman Manta Ray Prototype Video

వాహన ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హోవర్‌క్రాఫ్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీటిలో, గాలిలో కూడా పయనించగలదు. అయితే ఇప్పుడు 'నార్త్‌రోప్ గ్రుమ్మన్' (Northrop Grumman) అంతర్గత జలాలలో (నీటి లోపల) ప్రయాణించే ఓ సరికొత్త 'రోబోటిక్ మంటా రే సబ్‌మెర్సిబుల్' గురించి వెల్లడించింది.

'రోబోటిక్ మంటా రే సబ్‌మెర్సిబుల్'కు సంబంధించిన వీడియోలో గమనించినట్లయితే.. ఇది వేగంగా నీటిలోపల వెళ్లడం చూడవచ్చు. చూడటానికి ఓ చేప ఆకారంలో ఉండే ఈ వెహికల్ రెండు కన్నుల వంటి నిర్మాణం, రెక్కలు వంటి వాటిని కూడా పొందుతుంది. నీటిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి చేపవంటి నిర్మాణంలో దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నాము.

నార్త్‌రోప్ గ్రుమ్మన్.. తన మాంటా రే ప్రోటోటైప్‌ను ఈ ఏడాది పరీక్షించింది. లాంగ్ రేంజ్, లాంగ్ డ్యూరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన వాహనాన్ని నిమించడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని 'ఎక్స్‌ట్రా లార్జ్ అన్‌క్రూడ్ అండర్ వాటర్ వెహికల్' అని పిలుస్తారు. దీనిని DARPA అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారు చేశారు.

తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. అంతే కాకుండా ఎక్కువ బరువును తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇది పైకి, కిందికి గ్లైడింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ టెక్నాలజీ ఈ వాహనాన్ని మరింత వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇది సముద్రం అడుగు భాగంలో కూడా ప్రయాణించగలదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement