తేమ నుంచి తాగు నీరు: ప్రపంచంలో తొలిసారి.. భారీ లెవల్‌లో ప్రాజెక్టు

Water Generators In UAE Produces Drinking Water From Air - Sakshi

మంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తట్టుకునేందుకు యూఏఈ, టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. వాటర్‌ జనరేటర్ల సాయంతో తేమ నుంచి నీటిని తయారు చేసుకుంటోంది. అదీ పర్యావరణానికి ఎలాంటి భంగం కలిగించకుండానే!. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కాగా.. త్వరలో అధికారికంగా ఈ సెటప్‌ను దేశవ్యాప్తంగా లాంఛ్‌ చేయనుంది. విశేషం ఏంటంటే.. తాగు నీరు కోసం జరిగిన ప్రయోగాల్లో ఇదే భారీ సక్సెస్‌ కూడా.

అబుదాబి: పూర్తిగా సోలార్‌ పవర్‌తో నడిచే ప్రాజెక్ట్‌ ఇది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా.. హైపర్‌-డెహూమిడీఫైయర్స్‌ అనే జనరేటర్ల(20 జనరేటర్ల దాకా) సాయంతో రోజూ 6,700 లీటర్ల తాగు నీటిని తయారు చేశారు. పైగా ఇది నిరంతర ప్రక్రియ కావడం విశేషం(ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం మొదటిది ఇదే). ఇవి ఎలా పని చేస్తాయంటే.. సోలార్‌ ప్యానెల్స్‌- భారీ ఫ్యాన్‌లు-పైపులను అనుసంధానించి ఈ వాటర్‌ జనరేటర్ల సెటప్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లు వాతావరణంలోని తేమను లాక్కుని.. అనుసంధానంగా ఉన్న పైపుల ద్వారా జనరేటర్‌ సెటప్‌లకు చేరవేస్తాయి. ఈ మధ్యలో పైపుల గుండా తేమకు ప్రత్యేకమైన లిక్విడ్‌(చల్లబరిచేవి) చేరుస్తారు. తద్వారా ఆ తేమ పోయే కొద్దీ నీటి బిందువులుగా మారతాయి. ఆపై ఆ తేమ నీరు బొట్టు బొట్టుగా పెరిగి.. ఆ నీరు దశలవారీగా ఫిల్టర్‌ అవుతుంది. ఫైనల్‌గా ఈ వాటర్‌ జనరేటర్లు తాగు నీటిని బయటకు వస్తుంది.     

కండిషన్స్‌ అప్లై
ఇలా గాల్లో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేయడం కొత్తేం కాకపోవచ్చు. అయితే అవి అవసరాల కోసమే తప్పించి.. మంచి నీటి కోసం ఉత్పత్తి చేసేవి లేవు. యూఏఈ పరిశోధనలు మాత్రం భారీ లెవల్‌లో నీటిని ఉత్పత్తి చేయడం, అదీ తాగు నీటి అవసరాల కోసం చేయడం ప్రపంచంలో తొలిసారి. ఇక 26 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద.. అదీ గాల్లో 60 శాతం తేమ శాతం ఉన్నప్పుడు ఈ వాటర్‌ జనరేటర్లు పనిచేశాయి(పైలట్‌ దశలో ఇదే తేలింది). త్వరలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర్లోని మస్‌దర్‌ సిటీలో దీనిని లాంఛ్‌ చేయనున్నారు. సుమారు 54 ఎకరాల్లో సుమారు తొంభై వేల సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఈ సెటప్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top