
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వేల్యూ ఇన్వెస్టింగ్‌కి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌లోకి రూ. 884 కోట్లు రాగా, ఏయూఎం రూ. 8,004 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
సాధారణంగా నెగెటివ్ మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాల వల్ల ఉండాల్సిన దానికన్నా తక్కువ విలువకి ట్రేడవుతున్న స్టాక్స్‌లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయని వివరించారు. టారిఫ్‌లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఇంధన, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్ వంటి దేశీ పరిస్థితుల ఆధారిత రంగాలు ఆకర్షణీయంగా ఉండొచ్చన్నారు.