బాచుపల్లిలో క్లౌడ్‌ 33

Urbanrise launches On Cloud 33- A Luxury Apartments at Bachupally - Sakshi

పిల్లల కోసం జీనియస్‌ నాలెడ్జ్‌ సెంటర్‌

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అలయన్స్‌ గ్రూప్‌ అనుబంధ కంపెనీ అర్బన్‌రైజ్‌ బాచుపల్లిలో క్లౌడ్‌–33 అనే పేరుతో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 9.15 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 2,600 లగ్జరీ అపార్ట్‌మెంట్లుంటాయి. 1,100 నుంచి 2,021 చ.అ.లలో 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. సింగపూర్‌లోని సిటీస్కేప్స్, మొరాకో రాయల్‌ రెసిడెన్సీలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 85 వేల చ.అ.లలో క్లబ్‌ హౌస్‌లో జీరో గ్రావిటీ యోగా గది, రూఫ్‌ టాప్‌ మీద బార్బిక్యూ, ప్రైవేట్‌ పార్టీ ఏరియా, గ్రీన్‌ డైనింగ్, గేమింగ్‌ జోన్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.

ముందస్తు సొమ్ము చెల్లించి బుకింగ్‌ చేసుకుంటే చాలు 2026లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే కొనుగోలుదారులకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొదలవుతుందని ఈడీ రాజేంద్ర జోషి తెలిపారు. 1,3 ఎకరాల స్థలాన్ని సెంట్రల్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ను కేటాయించారు. దీంతో 75 శాతం స్థలం ఓపెన్‌ స్పేస్‌ ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘జీనియస్‌’ నాలెడ్జ్‌ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇందులో క్రచ్, డే కేర్‌ సెంటర్లతో పాటు ఆన్‌లైన్, ట్యూషన్, సంగీతం, నృత్యం, కుకరీ, ఏఐ, రోబోటిక్స్‌ వంటి శిక్షణ తరగతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. దీంతో పిల్లలకు భద్రత, రక్షణ ఉండటమే కాకుండా వారి అభిరుచులకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించేందుకు వీలవుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top