భారీగా ఏర్పాటైన కంపెనీలు, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Union Minister Rao Inderjit Singh Said 21,349 Companies On Csr Funds In 2019-20 - Sakshi

దేశీయంగా ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ మధ్యకాలంలో కొత్త కంపెనీల సంఖ్య 17,200 పైచిలుకు పెరిగింది. దీంతో జూన్‌ ఆఖరు నాటికి క్రియాశీలకంగా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.7 లక్షలకు చేరింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ ఈ విషయాలు తెలిపారు. ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో కొత్తగా 36,191 కంపెనీలు ఏర్పాటయ్యాయిని, గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 18,968 అని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్త సంస్థల సంఖ్య 17,223 మేర పెరిగినట్లయిందని మంత్రి వివరించారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా కంపెనీలపై ప్రతికూల ప్రభావమేదైనా ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.  

చదవండి: మరోసారి బ్రేకులు, వీడియోకాన్‌ టేకోవర్‌పై స్టే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top