ఇంజనీర్లకు ఉబెర్ గుడ్ న్యూస్

Uber to hire 140 engineers in Bengaluru, Hyderabad - Sakshi

140  ఇంజనీర్లను ఎంపిక చేయనున్న ఉబెర్

హైదరాబాద్, బెంగళూరులో నియామకాలు

సాక్షి,ముంబై : క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ శుభవార్త అందించింది. 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని తాజాగా ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్,  సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్  వెల్లడించింది.  

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించిన ఉబెర్  ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం,  మార్కెట్‌లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి. 

కాగా కరోనా సంక్షోభం కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఉబెర్ మే నెలలో ఇండియాలో 600 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 6700 మందిని లేదా 25 శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.  2017 లో 80 మందిగా ఉన్న ఇంజనీర్ల సంఖ్య  ప్రస్తుతం 600 మంది  పెరిగిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top