
2005లో భారతీయ మార్కెట్లో ప్రారంభమైన 'టయోటా ఇన్నోవా' ఏకంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీ దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ వంటివి పుట్టుకొచ్చాయి.
ప్రారంభం నుంచి మార్కెట్లో ఇన్నోవా 12 లక్షల యూనిట్లు అమ్మకాలను సాధించింది. ఈ అమ్మకాల్లో సాధారణ ఇన్నోవా మాత్రమే కాకుండా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ కూడా ఉన్నాయి. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.
2016లో ప్రారంభమైన ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 148 హార్స్ పవర్, 343 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 27.17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?
2022లో ప్రారంభమైన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుంచి రూ. 32.58 లక్షల మధ్య ఉంది. ఇది 2.0 లీటర్ VVTi పెట్రోల్ ఇంజిన్ ద్వారా 172 హార్స్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.