సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Tue, Feb 20 2024 4:03 PM

Today Stock Market Closing Update By Sakshi Money Mantra

ఈ రోజు (మంగళవారం) నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 349.24 పాయింట్ల లాభంతో 73057.40 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల లాభంతో 22197.00 పాయింట్ల వద్ద ముగిసాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, గ్లెన్‌మార్క్ ఫార్మా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి.

హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఫెడరల్ బ్యాంక్, బయోకాన్ లిమిటెడ్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. నేడు ఆటోమొబైల్ రంగం నష్టాల్లో సాగుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement