బెంగళూరులో టెస్లా: తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ | Tesla Opens Experience Center In Bengaluru After Mumbai And Delhi | Sakshi
Sakshi News home page

బెంగళూరులో టెస్లా: తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌

May 14 2026 5:05 PM | Updated on May 14 2026 5:09 PM

Tesla Opens Experience Center In Bengaluru After Mumbai And Delhi

టెస్లా తన ఉనికిని భారతదేశంలో విస్తరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు బెంగళూరులో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా టెస్లా తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ప్రారంభమైన టెస్లా కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో.. ఆరు సీట్ల ఎస్‌యూవీ టెస్లా మోడల్ YLతో పాటు, మోడల్ Yని కూడా చూడవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల దేశంలోని పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా సంస్థ వీటిని తీసుకొచ్చింది. ఇక్కడ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా లభిస్తుంది.

టెస్లా మోడల్ వైఎల్
ఇండియన్ మార్కెట్లో టెస్లా మోడల్ వైఎల్ లాంగ్ వీల్ బేస్ వేరియంట్‌ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మోడల్ Y శ్రేణి ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.

ఈ కారులోని 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు (WLTP సర్టిఫైడ్) రేంజ్ అందిస్తుంది. స్పీడ్‌ విషయానికి వస్తే.. కేఇది వలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మోడల్ వైఎల్ క్యాబిన్‌లో 16 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, హీటెడ్ వెంటిలేటెడ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement