ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్‌ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?

Tech Mahindra new cmd Mohit Joshi Biography and Salary - Sakshi

సాక్షి, ముంబై:  ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్‌ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన  పదివిని వరించిన  ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్‌ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. 

మోహిత్ జోషి ఎవరు?
టెక్‌ దిగ్గజం  ఇన్ఫోసిస్‌లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి.  ఇప్పటివరకు ఆయన ఒక్క  రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు.

(ఇదీ చదవండి: జాక్‌పాట్‌ అంటే ఇదే! నిమి...రతన్‌ టాటాను మించిపోయాడు!)

1974 ఏపప్రిల్‌13న జన్మించారు.  ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్‌లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు.

మోహిత్ తన కెరీర్‌లో  ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో  పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో  లండన్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు)  జీతం  పొందారు.

ఇన్ఫోసిస్‌కి పెద్ద  దెబ్బే
ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్‌కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్‌కి గుడ్‌బై చెప్పి  కాగ్నిజెంట్‌కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్‌కి పెద్ద లోటేనని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్  తరువాత  అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్‌ తీసివేతలు, ఈసారి ఎవరంటే?)

గుర్నానీకి సరైన  ప్రత్యామ్నాయం
టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్‌ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్‌ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్‌ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్‌ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై  ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. 

మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు
మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ
ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సేవలు
అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా
రిస్క్ & గవర్నెన్స్  నామినేషన్ కమిటీలలో సభ్యుడు
CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌
2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top