టీసీఎస్‌ రిజల్ట్స్‌..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం | TCS Q2 Results: TCS Results Slightly Increasing Income - Sakshi
Sakshi News home page

TCS: టీసీఎస్‌ రిజల్ట్స్‌..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం

Oct 11 2023 5:01 PM | Updated on Oct 11 2023 6:18 PM

TCS Results Slightly Increasing Income - Sakshi

ఇండియన్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్‌ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్‌ సెప్టెంబర్ క్వార్టర్‌ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది.

వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్‌ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్‌ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్‌ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్‌ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్‌ డీల్ విన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్‌ మీటింగ్‌ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్‌ బైబ్యాక్‌ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement