తుది దశలో టాటా-విస్ట్రాన్‌ డీల్‌.. పూర్తయితే ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థ ఇదే..

tata group closes in on deal with wistron to become first indian iphone maker - Sakshi

న్యూఢిల్లీ: యాపిల్‌ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్‌కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్‌ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్‌ ద్వారా టాటా గ్రూప్‌ ఈ డీల్‌ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ డీల్‌ పూర్తయితే యాపిల్‌ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్‌ ఉత్పత్తులను కూడా అసెంబుల్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌తో పాటు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌ వంటి సంస్థలు యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top