ప్రముఖ వైన్‌ కంపెనీ సీవోవో రాజీనామా | sula vineyards coo chaitanya rathi resigns | Sakshi
Sakshi News home page

ప్రముఖ వైన్‌ కంపెనీ సీవోవో రాజీనామా

Jul 3 2023 9:04 PM | Updated on Jul 3 2023 9:05 PM

sula vineyards coo chaitanya rathi resigns - Sakshi

ప్రముఖ ప్రీమియం వైన్‌ తయారీ కంపెనీ సులా వైన్‌యార్డ్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ చైతన్య రాఠీ రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. చైతన్య స్థానంలో కంపెనీ చీఫ్ వైన్ తయారీదారు కరణ్ వాసనిని నియమించనున్నారు.

కరణ్ వాసని కంపెనీ నాయకత్వ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. వైన్ తయారీ, వైనరీ కార్యకలాపాలు, వైటికల్చర్‌తో సహా కంపెనీ కీలక కార్యకలాపాలను చూస్తారు. సులాలో చేరడానికి ముందు ఆయన ఆర్థిక సేవల సంస్థ క్రిసిల్‌లో అనలిస్ట్‌గా పని చేశారు.

చైతన్య రాఠి తమ నాయకత్వ బృందంలో కీలకంగా పనిచేశారని, కంపెనీ వృద్ధికి, విజయానికి కృషి చేశారని, చాలా సంవత్సరాలుగా తనతో సన్నిహితంగా పనిచేశారని సుల వైన్‌యార్డ్స్‌ రాజీవ్‌ సుమంత్‌ పేర్కొన్నారు. కాగా చైతన్య రాఠి 2023 సెప్టెంబర్ చివరి వరకు కంపెనీలో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement