
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితి సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మిశ్రమ ప్రపంచ మార్కెట్ కదలికల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 496.09 పాయింట్లు లేదా 0.65 శాతం లాతంతో 77,401.60 వద్ద, నిఫ్టీ 50 124.70 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,475.10 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్‌టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ప్రారంభం అనంతరం బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, వాణిజ్య సుంకాల ఆందోళనలు, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల చర్యలతో భారత స్టాక్ మార్కెట్లు నడిచే అవకాశం ఉంది. ఈ రోజు విడుదల కానున్న మార్చి నెలకు సంబంధించిన ఇండియా మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ ఫ్లాష్ గణాంకాలపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచనున్నారు.
విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత రూపాయి వరుసగా తొమ్మిదో సెషన్ లోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. శుక్రవారం ముగింపు 85.98 తో పోలిస్తే యూఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు బలపడి 85.94 వద్ద ప్రారంభమైంది.