
టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేరు ధర బలహీనమైన జూన్ త్రైమాసిక ఫలితాల మధ్య బిఎస్ఇలో ప్రారంభ ఒప్పందాలలో 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సహా ఇతర ఐటీ షేర్లు కూడా 3 శాతం వరకు క్షీణించాయి.
ఉదయం 9.46 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు లేదా 0.23% నష్టపోయి82,996.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు లేదా 0.22% నష్టంతో 25,299.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టెక్ ఎం, ఎటర్నల్ (జొమాటో), బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో కొనసాగుతుండగా హెచ్యూఎల్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.03 శాతం, 0.14 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ ఆటో 0.15 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 0.57 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి.