
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్స్ నుంచి బలమైన క్యూ1 రాబడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 82,200.34 స్థాయిలలో స్థిరపడగా, నిఫ్టీ 50 122.3 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,090.7 స్థాయిలలో ముగిసింది.
నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.66 శాతం లాభపడగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, బీఎస్ ఈ, బీడీఎల్, పాలసీబజార్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్, అశోక్ లేలాండ్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ప్రతికూల ప్రభావంతో ఫ్లాట్ గా స్థిరపడింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్యాంక్ షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ, ఆటో, ఎనర్జీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 18 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 5.4 శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.67 శాతం క్షీణించి 11.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.