నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Stock Market close July 17 2025 Sensex falls Nifty at | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Jul 17 2025 3:44 PM | Updated on Jul 17 2025 3:51 PM

Stock Market close July 17 2025 Sensex falls Nifty at

దేశీయంగా జూన్ త్రైమాసిక రాబడులు మందకొడిగా ప్రారంభం కావడం, ప్రపంచవ్యాప్తంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌  సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375.24 పాయింట్లు లేదా 0.45 శాతం క్షీణించి 82,259.24 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.6 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 25,111.45 వద్ద స్థిరపడింది.

విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.39 శాతం నష్టంతో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఎల్టీఐ, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఎంఫాసిస్, కోఫోర్జ్, హెచ్సీఎల్ టెక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నీ రెడ్‌లోనే ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 1.24 శాతం లాభపడగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.

సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు నష్టాలలో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, టీసీఎస్ షేర్లు 2.8 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో టాటా స్టీల్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ స్వల్పంగా పెరిగి 0.02 శాతం పెరిగి 11.24 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement