
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై 26) రాబడులపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ1 త్రైమాసిక ఫలితాలు నేడు ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 345.8 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 83,190.28 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 కూడా 120.85 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,355.25 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.3 శాతం నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఐటీ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు ఎడ్లో ముగిశాయి. అదేసమయంలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు 2.6 శాతం వరకు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.24 శాతం క్షీణించి 11.6 పాయింట్ల వద్ద స్థిరపడింది.