
చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. 5 కోట్ల వరకు రుణాల కోసం.. 2023-24లో ప్రారంభించిన ఎస్‌ఎంఈ డిజిటల్ బిజినెస్ లోన్స్‌కి గణనీయంగా స్పందన లభిస్తోందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది.
రుణ మంజూరీకు సంబంధించి టర్నెరౌండ్ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిందని పేర్కొంది. వచ్చే అయిదేళ్లపాటు వృద్ధి, లాభదాయకత కోసం ఎంఎస్‌ఎంఈ రు ణాలపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు వివరించింది. సుమారు రూ. 3,242 కోట్ల విలువ చేసే 67,299 ఎంఎస్‌ఎంఈ ముద్రా రుణాలు కూడా ఇందులో భాగంగా ఉన్నట్లు వివరించింది.
అవసరమైన వివరాలన్నీ సమర్పించాక, 10 సెకన్ల వ్యవధిలోనే, మానవ జోక్యం లేకుండా, కేవలం పది సెకన్ల వ్యవధిలోనే రుణ మంజూరు నిర్ణయాలు తీసుకునే డేటా ఆధారిత క్రెడిట్ అసెస్‌మెంట్ ఇంజిన్‌ను రూపొందించినట్లు తెలిపింది. రూ. 50 లక్షల వరకు రుణాల మదింపు కోసం లావాదేవీల చరిత్ర, జీఎస్‌టీ రిటర్నులనే పరిగణనలోకి తీసుకుంటూ, ఆర్థిక పత్రాలు సమర్పించాల్సిన నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.
ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి