కొత్త ఏడాదిలో ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..!

SBI Introduces New IMPS Slab, To Charge RS 20 Plus GST per transaction - Sakshi

కొత్త ఏడాదిలో ఎస్‌బీఐ తన ఖాతాదారులకు మంచి శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన బ్యాంకు శాఖల వద్ద చేసే డబ్బు బదిలీలకు సంబంధించిన తక్షణ చెల్లింపు సేవ(ఐఎమ్‌పీఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐఎమ్‌పీఎస్ లావాదేవీల కొత్త స్లాబ్ అనేది ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. ఐఎమ్‌పీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బును పంపినందుకు రూ.20లతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఐఎమ్‌పీఎస్ అంటే ఏమిటి? 
ఐఎమ్‌పీఎస్ అంటే తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, బ్యాంక్ బ్రాంచీలు, ఎటిఏమ్స్, ఎస్ఎమ్ఎస్, ఐవిఆర్ఎస్ వంటి వివిధ ఛానల్స్ ద్వారా ఐఎమ్‌పీఎస్ వ్యవస్థను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఖాతాదారులు ఏడాదిలో ఎప్పుడైనా వేగంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా బ్యాంకులు, ఆర్బిఐ అధీకృత ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్(పిపిఐ) వ్యక్తులు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. 

ఐఎమ్‌పీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్‌పీఎస్) విధానంలో డబ్బులు వెంటనే ఇతరుల బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లిపోతాయి. కనీసం రూ.1 నుంచి డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా ఇప్పుడు రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.2 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచింది. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. రూ.2 లక్షల వరకు ఐఎమ్‌పీఎస్ ద్వారా ఉచితంగా పంపించవచ్చు. ఆ తర్వాత పంపించే మొత్తాలకు ఛార్జీలు వర్తిస్తాయి.

(చదవండి: రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. వచ్చే బడ్జెట్‌లో)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top