రెండేళ్లలో బ్యాంకింగ్‌ ఆధునీకరణ పూర్తి | SBI Banking Upgradation Roadmap details | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో బ్యాంకింగ్‌ ఆధునీకరణ పూర్తి

Nov 14 2025 9:15 AM | Updated on Nov 14 2025 9:15 AM

SBI Banking Upgradation Roadmap details

అనుబంధ సంస్థ ఎస్‌బీఐ పేమెంట్స్‌ సర్వీసెస్‌తో పాటు తమ కోర్‌–బ్యాంకింగ్‌ మౌలిక సదుపాయాల ఆధునీకరణ ప్రక్రియను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం నాలుగు రకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు బ్యాంక్‌ ఎండీ (కార్పొరేట్‌ బ్యాంకింగ్, సబ్సిడరీస్‌) అశ్విని కుమార్‌ తివారీ తెలిపారు.

హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, యూనిక్స్‌ నుంచి లినక్స్‌కి మారడం, మైక్రోసర్వీసులను ప్రవేశపెట్టడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు సింగపూర్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. డేటా భద్రత, నియంత్రణ సంస్థ నిర్దేశిత నిబంధనలను పాటిస్తూనే కార్యకలాపాల విస్తరణకు ఉపయోగపడేలా ప్రైవేట్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తివారీ వివరించారు. సిస్టమ్‌లు అన్ని వేళలా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూసుకుంటూనే వాటిని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.

ఫిన్‌టెక్‌ వ్యవస్థతో పోటీపడటం కాకుండా వాటితో కలిసి పని చేసే విధానానికి మళ్లుతున్నట్లు వివరించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా శాండ్‌బాక్స్, ఇన్నోవేషన్‌ హబ్‌లను ఎస్‌బీఐ ఏర్పాటు చేసినట్లు తివారీ చెప్పారు. ఫిన్‌టెక్‌లు తమ సొల్యూషన్స్‌ను టెస్ట్‌ చేసి, ఎస్‌బీఐ సిస్టమ్‌లకు అనుసంధానించేందుకు వీలుగా 300 పైగా ఏపీఐలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement