
పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలందించే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ‘ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్‌మెంట్’(ఏఎఫ్‌డీ)తో 100 మిలియన్ యూరోల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
కాలుష్యకారక ఉద్గారాలను, గ్లోబల్ వార్మింగ్‌ను, వాతావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించే దిశగా ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొంది. 2030 నాటికి మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్సింగ్ విభాగం వాటాను 7.5–10 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది.