రూ.31వేల ఈ లేటెస్ట్‌ 5జీ ఫోన్‌ ఇప్పుడు రూ.23వేలే..!

Samsung Galaxy A34 5G Gets Discount of Rs 3000 - Sakshi

ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోన్‌లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్‌ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్‌ అయింది.

రూ. 3,000 తగ్గింపు
తాజగా శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్  వేరియంట్‌ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు

  • FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
  • MediaTek డైమెన్సిటీ 1080 SoC
  • 8GB వరకూ ర్యామ్‌, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌
  • 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ
  • OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌
  • 13MP సెల్ఫీ కెమెరా
  • స్టీరియో స్పీకర్లు 
  • 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS 
  • కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top