సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ | Sahara Case SEBI Supreme Court 14106 Crore Illegal Fundraising Employees | Sakshi
Sakshi News home page

సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ

Jun 14 2026 3:16 PM | Updated on Jun 14 2026 3:46 PM

Sahara Case SEBI Supreme Court 14106 Crore Illegal Fundraising Employees

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్‌’ మినహాయింపునిచ్చింది.

అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్‌ 18న విచారించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement