బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!

RNR co founder ramya ravi success story and turnover - Sakshi

RNR Co-Founder Ramya Ravi Success Story: కొంతమంది చదువులో రానించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, మరి కొందరు బిజినెస్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఒక యువతి బిర్యాని విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తోంది. బిర్యానీ ఏంటి? కోట్లు సంపాదించడం ఏంటి అని మీకు సందేహం రావొచ్చు.. ఇది అక్షరాలా నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మనకు బిర్యాని అనగానే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. అయితే దొన్నె బిర్యాని అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరు. ఈ దొన్నె బిర్యాని అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బెంగళూరుకు చెందిన 'రమ్య రవి' (Ramya Ravi). అమ్మమ్మ చేసే దొన్నె బిర్యాని తింటూ పెరిగిన ఈమె ఇప్పుడు ఆ బిర్యానితో బిజినెస్ చేస్తోంది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రమ్య (2020లో) రూ. 5 లక్షల పెట్టుబడితో బిర్యాని వ్యాపారం ప్రారంభించాలని ముందడుగు వేసింది. అందరూ భయపడుతున్న సమయంలో ప్రారంభించిన ఈ బిజినెస్ ఊహకందని రీతిలో విజయ పథంలో పయనించడం మొదలు పెట్టింది.

(ఇదీ చదవండి: ఐఏఎస్‌ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!)

వ్యాపారం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే లాభాలు రావడం మొదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఈమె బిజినెస్ టర్నోవర్ ఏకంగా రూ. 10 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరు RNR దొన్నె బిర్యానీకి మారుపేరుగా నిలిచింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె ది వ్యాలీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్ కాలేజీ బీకామ్ పూర్తి చేసింది. ఆ తరువాత వ్యాపారంలో కొన్ని మెళుకువలను నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్‌లో కోర్స్ కూడా పూర్తి చేసింది. ఈమెకు శ్వేత, రవీనా అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ)

ప్రారంభంలో బెంగళూరు నాగరబావి ప్రాంతంలో కేవలం 200 అడుగుల స్థలంలో హోటల్ ప్రారంభించింది. ఆ సమయంలో వారికి కేవలం ఒక వంటవాడు మాత్రమే ఉండేవాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. వారు వ్యాపారం ప్రారంభించిన మొదటి నెలలోనే 10000 డెలివరీలు చేశారు. క్రమంగా డిమాండ్ భారీగా పెరగడంతో వ్యాపారం విస్తరించడంపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే 2021లో బెంగళూరులోని జయనగర్‌లో రెస్టారెంట్‌ ప్రారంభించారు. వీరు ఇతర రెస్టారెంట్స్ మాదిరిగా కాకూండా టిన్ బాక్స్‌లలో బిర్యాని అందిస్తారు. ఈ విధానం చాలామందిని ఆకర్శించింది. ప్రస్తుతం భారీ లాభాల్లో పరుగులు పెడుతోంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top