జియో యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ .. ఇక రీఛార్జ్‌ చేయడం చాలా తేలిక..!

Reliance Jio introduces UPI autopay in collaboration with NPCI - Sakshi

ముంబై: రిలయన్స్ జియో తన యూజర్లకు తీపికబురు అందించింది. ఇకపై జియో యూజర్లు సులభంగా రీఛార్జ్‌ చేసుకునేందుకు సరికొత్త ఫీచర్ అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. ప్రముఖ రిలయన్స్ జియో కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో మిలియన్ల మంది యుపీఐ, జియో వినియోగదారుల కోసం ఆటోపే ఫీచర్ ప్రారంభించింది. యూపీఐ ఆటోపే ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి టెలికాం కంపెనీగా జియో నిలిచింది.

ఈ యుపీఐ ఆటోపే ఫీచర్ జియో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. యూజర్లు ఇకపై యూపీఐ ద్వార తమ టారిఫ్‌ ప్లాన్‌ రీచార్జ్‌ కోసం స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఆటో డెబిట్‌ ఫీచర్‌ను సెట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు ప్రతి నెల రీఛార్జ్‌ చేయకున్న ఆటో డెబిట్‌ ఫీచర్‌ వల్ల ఆటోమెటిక్‌గా మీ ఖాతాలో నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఈ ఫీచర్ వల్ల ప్రతి నెల రీఛార్జ్‌ చేసుకునే భాద తప్పుతుంది. ఎంత ప్లాన్ రీఛార్జ్‌ చేసుకోవాలి అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు మైజియో యాప్‌లో యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5,000 వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ లావాదేవీ కోసం మీరు యుపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదు.

(చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top