
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.14,900 కోట్లు సమీకరించింది. వివిధ విడతలతో కూడిన ఈ వేలంలో ఆరు రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాల కోసం గణనీయమైన నిధులను సమకూర్చుకున్నాయి. ఆర్‌బీఐ అధికారిక ప్రకటన ప్రకారం.. వివిధ మెచ్యూరిటీల ద్వారా మొత్తం రూ.15,300 కోట్లు ఆఫర్ చేసింది. కానీ చివరకు రూ.14,900 కోట్లు అందించింది. ఆర్‌బీఐ రుణాలు ఇచ్చిన ఆరు రాష్ట్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఈ సెక్యూరిటీల వేలంలో బిహార్ అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. మూడు వేర్వేరు విడతల ద్వారా రూ.6,000 కోట్లు సేకరించింది. 5, 9 మరియు 11 సంవత్సరాల కాలపరిమితితో సెక్యూరిటీల ద్వారా రాష్ట్రం రూ.2,000 కోట్ల చొప్పున నిధులు సమీకరించింది. గోవా.. 11 సంవత్సరాల సెక్యూరిటీ ద్వారా 7.48% ఈల్డ్‌తో రూ.100 కోట్ల రూపాయలను సేకరించింది.
హరియాణా రూ.1,500 కోట్లు, జమ్మూ కశ్మీర్ 7.51% ఈల్డ్ అందించే 20 సంవత్సరాల బాండ్‌తో రూ.300 కోట్లు సమీకరించింది. మధ్యప్రదేశ్ మూడు వేర్వేరు విడతల ద్వారా రూ. 4,000 కోట్లు సేకరించింది. మహారాష్ట్ర మూడు మెచ్యూరిటీలలో రూ.3,000 కోట్లు అప్పుగా తీసుకుంది.
ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన