మార్కెట్‌కు ‘ఆర్‌బీఐ’ ఉత్సాహం

RBI liquidity measures lift Sensex by 424 pts Nifty ends at 14618 - Sakshi

కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూలతలు

బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లలో కొనుగోళ్లు

మూడురోజుల అమ్మకాలకు విరామం 

సెన్సెక్స్‌ లాభం 424 పాయింట్లు

14,600 పైకి నిఫ్టీ

ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మార్కెట్‌లో మూడురోజుల వరుస అమ్మకాలకు బుధవారం బ్రేక్‌ పడింది. ఒక్క రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 424 పాయింట్లు పెరిగి 48,678 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద నిలిచింది.

కరోనా వ్యాప్తి వేళ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్‌బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా వైద్య రంగ బలోపేతానికి రూ.50 వేల కోట్ల ఫండ్‌ను ప్రకటించారు. భారీ ఎత్తున నిధుల కేటాయింపు ప్రకటనతో ఫార్మా షేర్లకు డిమాండ్‌ నెలకొంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 489 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్‌ భారీగా లాభపడినప్పటికీ., చిత్రంగా విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలు జరిపారు. ఎఫ్‌ఐఐలు రూ.1,111 కోట్ల కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.241 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత ఏర్పడకుండా మే 20 నుంచి రూ.35వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు ప్రక్రియను చేపడతామని ఆర్‌బీఐ ప్రకటన ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఇచ్చింది. దేశీయ ఇండెక్స్‌కు సంబంధించి మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) రీ–బ్యాలెన్సింగ్‌(సవరణ)తో కొన్ని ఎంపిక చేసుకున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏప్రిల్‌ సేవల రంగ గణాంకాలు నెల ప్రాతిపదికన నిరుత్సాహపరిచినప్పటికీ.., క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది.’’ రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ బినోద్‌ మోదీ అభిప్రాయపడ్డారు.

బ్యాంకింగ్‌ షేర్లకు ఆర్‌బీఐ బూస్టింగ్‌...   
కరోనా రెండో దశను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు బ్యాంకింగ్‌ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభపడ్డాయి. చిన్న తరహా ఫైనాన్స్‌ బ్యాంకుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మొండిబకాయిల అంశంలో వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకులకు అనుమతులిస్తున్నట్లు దాస్‌ పేర్కొన్నారు. ఆర్థికపరమైన ఈ విధాన చర్యలతో బ్యాంకింగ్‌ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగానికి చెందిన కోటక్‌ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌  రెండున్నర శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 2–1% ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ప్రైవేట్‌ రంగ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 00:57 IST
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార...
06-05-2021
May 06, 2021, 00:40 IST
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌...
05-05-2021
May 05, 2021, 18:41 IST
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో...
05-05-2021
May 05, 2021, 18:23 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి...
05-05-2021
May 05, 2021, 18:01 IST
రాజస్థాన్‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది.  కరోనాతో మృతి చెందిన  తండ్రి మరణాన్ని తట్టుకోలేని  ఓ కుమార్తె ఆయన...
05-05-2021
May 05, 2021, 17:38 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతుంటే కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్...
05-05-2021
May 05, 2021, 14:29 IST
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల  సంతృప్తి చెందినవారి శాతంలో 20% కోత పడినా.. మిగతా దేశాధినేతలతో  పోలిస్తే ఆయన...
05-05-2021
May 05, 2021, 14:15 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ...
05-05-2021
May 05, 2021, 13:58 IST
కోవిడ్‌ మళ్లీ సోకితే ఏం చేయాలి? వ్యాక్సిన్‌ వేసుకున్నా వస్తుందా? ఇలా జరిగితే ఏదైనా ప్రమాదం ఉంటుందా?
05-05-2021
May 05, 2021, 13:58 IST
సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స...
05-05-2021
May 05, 2021, 13:16 IST
న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్‌ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన...
05-05-2021
May 05, 2021, 12:17 IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 
05-05-2021
May 05, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్‌, కోవిడ్‌ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కోవిడ్‌పై ఉన్న భయాన్ని...
05-05-2021
May 05, 2021, 11:42 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు...
05-05-2021
May 05, 2021, 09:51 IST
‘ఉష్ట్రపక్షిలా మీరు ఇసుకలో తలదూర్చగలరేమో కానీ మేమలా చేయలేం
05-05-2021
May 05, 2021, 09:08 IST
సత్తుపల్లిరూరల్‌: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది....
05-05-2021
May 05, 2021, 08:53 IST
20 ఏళ్లుగా విలక్షణ నటుడు జగపతిబాబు అభిమానిగా ఉన్న శ్రీను గుంటూరులో కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి...
05-05-2021
May 05, 2021, 08:12 IST
కోవిడ్‌ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది.
05-05-2021
May 05, 2021, 07:58 IST
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితులకు ఆక్సిజన్‌...
05-05-2021
May 05, 2021, 03:02 IST
కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top