ప్రపంచంలోనే నంబర్‌వన్‌ హోటల్‌ ‘రాంబాగ్‌ ప్యాలెస్‌’.. ఎక్కడుందో తెలుసా? 

Rambagh Palace bags the No 1 Hotel title in the World 2023 Travellers Choice Award by Tripadvisor - Sakshi

ముంబై: హోటల్స్‌ ర్యాంకింగ్‌కు సంబంధించిన ట్రావెలర్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌ (2023)లో జైపూర్‌కి చెందిన రాంబాగ్‌ ప్యాలెస్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ హోటల్‌గా నిల్చింది. 1835 నాటి ఈ ప్యాలెస్‌ను ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) హోటల్‌గా తీర్చిదిద్ది, నిర్వహిస్తోంది. దీన్ని ’జ్యుయల్‌ ఆఫ్‌ జైపూర్‌’గా కూడా వ్యవహరిస్తుంటారు. 

ట్రావెల్‌ సైట్‌ ట్రిప్‌అడ్వైజర్‌ వార్షికంగా ప్రకటించే.. పర్యాటకులు మెచ్చిన హోటల్స్‌ జాబితాలో మాల్దీవులకు చెందిన ఓజెన్‌ రిజర్వ్‌ బాలిఫుషి, బ్రెజిల్‌లోని హోటల్‌ కోలీన్‌ డి ఫ్రాన్స్‌ రెండు, మూడో స్థానాల్లో నిల్చాయి. తమ పోర్టల్‌లో నమోదైన 12 నెలల డేటా (2022 జనవరి 1 నుంచి – డిసెంబర్‌ 31 వరకు) విశ్లేషణ ఆధారంగా ట్రిప్‌అడ్వైజర్‌ ఈ ర్యాంకులు ఇచ్చింది.

భారత్‌లోని టాప్ 10 హోటల్స్ ఇవే..

  • రాంబాగ్ ప్యాలెస్ - జైపూర్
  • తాజ్ కృష్ణ - హైదరాబాద్
  • వెస్టిన్ గోవా - గోవా
  • బ్లాంకెట్ హోటల్ అండ్‌ స్పా - పల్లివాసల్
  • చండీస్ విండీ వుడ్స్ - చితిరపురం
  • జేడబ్ల్యూ మారియట్ హోటల్ పూణే - పూణే
  • షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్‌ స్పా - చెన్నై
  • కోర్ట్‌ యార్డ్‌ అమృత్‌సర్ - అమృత్‌సర్
  • జేడబ్ల్యూ మారియట్ హోటల్ బెంగళూరు - బెంగళూరు
  • లీలా ప్యాలెస్ ఉదయపూర్ - ఉదయపూర్ 

ఇదీ చదవండి: ఎల్‌ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులకు పెరిగిన విలువ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top