
న్యూఢిల్లీ: రిటైల్ రుణ ఉత్పత్తులపై ప్రాసెసింగ్, సర్వీస్ చార్జీలను ఎత్తివేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) ప్రకటించింది. కస్టమర్లకు విరివిగా రుణాలు ఇచ్చే లక్ష్యంతో ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది.
గృహ రుణాలను 6.80 ఆకర్షణీయ రేటుకే ఆఫర్ చేస్తున్నామని.. అలాగే, కారు రుణాలపై 7.15 శాతం రేటు, వ్యక్తిగత రుణాలు 8.95 శాతం రేటు నుంచి అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.