స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి పొందండి... ‘ఇదేం బాలేదు’

Prahar writes to FinMin over violation of ads norms by brokers - Sakshi

న్యూఢిల్లీ: కొన్ని బీమా బ్రోకింగ్‌ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడంపై పౌర సేవా సంస్థ ‘ప్రహర్‌’ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో పాలసీలను విక్రయించే కొన్ని నూతన తరం బీమా బ్రోకింగ్‌ కంపెనీలు.. కేవలం కొన్నేళ్ల పాటు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి మొత్తాన్ని పొందొచ్చంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో వివరించింది. (రూ. 2 వేల నోట్లు: ఆర్‌బీఐ కీలక ప్రకటన)

గత ఆర్థిక ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పనితీరును పాలసీదారులకు వెల్లడించరాదని బీమా రంగ ప్రకటనల చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నట్టు గుర్తు చేసింది. అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా సంబంధిత బీమా బ్రోకింగ్‌ సంస్థలను ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ, బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)ను కోరింది. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్‌, సరికొత్త ప్లాన్‌ కూడా)

లేదంటే అలాంటి ప్రకటనలు బీమా పాలసీలను వక్రమార్గంలో విక్రయించడానికి దారితీస్తాయని, పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీబజార్, ఇన్సూర్‌దేఖో మార్గదర్శకాలను ఉల్లంఘంచినట్టు ప్రహర్‌ తన లేఖలో ప్రస్తావించింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. నియంత్రణ సంస్థలు ఏవైనా లోపాలను గుర్తిస్తే, వాటి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రకటించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top