
'పోప్ లియో XIV'కి బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్' అందించారు. ఈ మోటార్‌సైకిల్‌ను మిస్సియో ఆస్ట్రియా అక్టోబర్ 2025లో సోథెబైస్ ద్వారా వేలం వేయనున్నారు. దీని నుంచి వచ్చిన డబ్బును మడగాస్కర్‌లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు వినియోగించనున్నారు.
పోప్ లియో XIVకు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ అనేది కస్టమైజ్డ్ బైక్. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ అధిపతి 'మైఖేల్ సోమర్' అందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. బైకు ఫ్యూయెల్ ట్యాంక్ మీద పోప్ సంతకం, డేట్ వంటివి ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా 991 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో రూ. 32.50 లక్షలు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో 10.25 ఇంచెస్ TFT కలర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయెల్ లెవల్, స్పీడ్ మొదలైన వాటిని రైడర్ చూడవచ్చు. డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్‌ల్యాంప్‌లు, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు.. రాక్, రోల్ అనే రైడ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.