ఎంట్రప్రెన్యూర్లకు ముద్రా రుణాల దన్ను | PM Mudra Yojana Empowers Entrepreneurs 40 Lakh Cr Loans Boost India Growth | Sakshi
Sakshi News home page

ఎంట్రప్రెన్యూర్లకు ముద్రా రుణాల దన్ను

Apr 9 2026 8:18 AM | Updated on Apr 9 2026 8:40 AM

PM Mudra Yojana Empowers Entrepreneurs 40 Lakh Cr Loans Boost India Growth

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు ఆర్థికంగా సాధికారత కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వికసిత భారత్‌ 2047 లక్ష్యంలో వారు కూడా భాగమయ్యేలా తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించి 11 ఏళ్లయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ స్కీము దన్నుతో గత దశాబ్దకాలంలో కోట్లాది సామాన్య ప్రజలు సరికొత్త ఆత్మవిశ్వాసంతో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ చేపట్టినట్లు మంత్రి వివరించారు.

‘రుణాలను మరింతగా అందుబాటులోకి తేవడం ద్వారా కోట్లాది మంది ప్రజలు గొప్ప కలలు కనేందుకు, వాటిని సాకారం చేసుకునేందుకు పీఎం ముద్రా యోజన సాధికారత కల్పించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ .. ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభమైన పీఎంఎంవై కింద ఇప్పటివరకు రూ. 40.07 లక్షల కోట్ల విలువ చేసే 57.79 కోట్ల రుణాలు మంజూరైనట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

మూడింట రెండొంతుల లోన్స్‌ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు, అయిదింట ఒక వంతు రుణాలు ఫస్ట్‌ టైమ్‌ ఎంట్రప్రెన్యూర్లకు  మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర భాగస్వాములు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement