వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ

PhonePe gets Walmart 200Mn usd Retains Majority Stake - Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే కొత్తగా 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,650 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ప్రధాన వాటాదారు వాల్‌మార్ట్‌ ఈ మేరకు నిధులు సమకూర్చింది. సింగపూర్‌ నుంచి భారత్‌కు కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఫోన్‌పే 1 బిలియన్‌ డాలర్ల వరకూ మూలధనాన్ని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా అందిన నిధులతో ఇప్పటివరకూ 650 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 5,360 కోట్లు) సమీకరించినట్లవుతుంది.

(ఇదీ చదవండి:  బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?)

మిగతా పెట్టుబడులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిధులను బీమా, వెల్త్‌ మేనేజ్‌మెంట్, రుణాలు, స్టాక్‌ బ్రోకింగ్‌ మొదలైన వ్యాపార విభాగాల వృద్ధికి ఉపయోగించుకోనుంది. గూగుల్‌ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీ పడుతోంది.

సరికొత్త ఫీచర్లతో బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ సిరీస్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top