సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పనిచేసే స్వతంత్ర, లాభాపేక్షలేని సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్ఐఆర్డిసీ (NIRDC), భారతీయ ఎంఎస్ఎంఈలకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మెరుగుపరచడానికి రూపొదించిన స్వదేశీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇండ్ఆప్ (InDApp)ను అధికారికంగా ప్రారంభించింది. ఈ అప్లికేషన్‌ను సామాజిక న్యాయం & సాధికారిత, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖల రాష్ట్ర మంత్రి బి. ఎల్. వర్మ ఆవిష్కరించారు.
ఎన్ఐఆర్డిసీ బహుశాఖ ఫెసిలిటేషన్ వ్యూహంలో భాగంగా అభివృద్ధి చేసిన ఇండ్ఆప్ (InDApp), ఎంఎస్ఎంఈల కార్యకలాపాల్లో వేగం, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే ఒకే వేదికగా పనిచేస్తుంది. ప్రభుత్వ అనుమతులు, రియల్‌టైమ్ మార్కెట్ సమాచారం, జాతీయ వ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలకు సులభంగా ప్రాప్యతను కల్పించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ సుగమమైన, అవగాహనతో కూడిన వ్యాపార నిర్ణయాలను తీసుకునేలా పారిశ్రామికవేత్తలకు శక్తినిస్తుంది.
ఈ కార్యక్రమానికి ఎన్ఐఆర్డిసి ఉన్నతాధికారులు.. శంభు సింగ్ (రిటైర్డ్ ఐఏఎస్), నేషనల్ చైర్మన్ డా. లలిత్ వర్మ (ఐఏఎస్, రిటైర్డ్), నేషనల్ వైస్ చైర్మన్ శుభిష్ పీ. వసుదేవ్, నేషనల్ అడ్మినిస్ట్రేటర్ డా. కే.వీ. ప్రదీప్ కుమార్, నేషనల్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఎస్టాబ్లిష్‌మెంట్); ఎస్. మనోజ్, డైరెక్టర్ (దక్షిణ ప్రాంతం) సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇండ్ఆప్ భౌతిక అవుట్‌రీచ్‌ను డిజిటల్ సౌకర్యాలతో అనుసంధానం చేస్తూ, దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తల కోసం సులభమైన ఎంగేజ్‌మెంట్ మోడల్‌ను సృష్టిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ పరిమాణం, రంగం, భౌగోళిక స్థానం ఏమిటన్నది సంబంధం లేకుండా, మైక్రో, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు పారిశ్రామిక అవకాశాలు, మార్కెట్ ధోరణులు, ఎగుమతి ప్రమోషన్ పథకాలు, ఆర్థిక సబ్సిడీలు, సాంకేతికత అప్‌గ్రేడ్‌లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తక్షణమే పొందేందుకు అనుమతిస్తుంది. వ్యాపార ప్రయాణంలోని ప్రతి దశలో మార్గనిర్ధేశం చేయడం, సహచరులు, భాగస్వాములు, సహకారులకు కలిసే అవకాశాలను విస్తరించడం ద్వారా ఇది సంపూర్ణ వ్యాపార సహాయక వ్యవస్థగా పనిచేస్తుంది. జాతీయ & గ్లోబల్ స్థాయిలో ఉన్న అవకాశాలకు MSME లకు ప్రాప్తిని పెంచడం ద్వారా,ఇండ్ఆప్ (InDApp) భారత MSME ఎకోసిస్టమ్‌లో సమగ్రతను బలోపేతం చేస్తూ పోటీశీలతను పెంచుతుంది.
మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు, InDAppను ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి అభివృద్ధి చేశారు. అవి..
ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ
మత్స్య, పశుసంవర్థక & పాడి పరిశ్రమ శాఖ
వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
వాణిజ్య & పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నూతన & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ


