బ్రిటన్‌ కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను! అదే నిజమైతే!

Mukesh Ambani Reliance, Apollo Plan Joint Bid For Walgreens Boots - Sakshi

లండన్‌: కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్‌ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరో బ్రిటన్‌ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్‌ ’బూట్స్‌’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.

అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి సంయుక్తంగా బిడ్‌ వేయాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తున్నట్లు బ్రిటన్‌ వార్తాపత్రిక ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఒక కథనం ప్రచురించింది. 

ఈ డీల్‌ సాకారమైతే.. బూట్స్‌ కొత్తగా భారత్, మధ్య ప్రాచ్య, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుంటుందని పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ఫార్మసీ చెయిన్‌ అయిన బూట్స్‌కు అమెరికాకు చెందిన వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయన్స్‌ మాతృ సంస్థ. తమ దేశంలో హెల్త్‌కేర్‌ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బూట్స్‌ను వాల్‌గ్రీన్‌ బూట్స్‌ గతేడాది డిసెంబర్‌లో అమ్మకానికి పెట్టింది. బిడ్ల దాఖలుకు మే 16 ఆఖరు రోజు. బూట్స్‌కు బ్రిటన్‌లో 2,000 పైచిలుకు స్టోర్స్‌ ఉన్నాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top