
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 కోసం ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లపై ‘బిగ్‌బిలియన్ మోటోరష్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఏఐ-ఆధారిత మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొదలుకొని మోటో జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు, మోటరోలా రేజర్ 60 సిరీస్ వరకు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 8+ 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,999 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్ కింద రూ.24,999 లకే సొంతం చేసుకోవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 8+256జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.19,999, 12+256జీబీ రూ.21,999 లకు అందుబాటులో ఉంటుంది.
మోటో జీ96 5జీ 8+128జీబీ రూ.14,999లకు, 8+256జీబీ రూ.16,999లకు వస్తుంది.
మోటో జీ86 పవర్ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు.
మోటరోలా రేజర్ 60 8+256జీబీ వేరియంట్ బిగ్ బిలియన్ డేస్ ధర రూ.39,999.