సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..

Microsoft ceo satya nadella luxury house in bellevue details - Sakshi

మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి అగ్రరాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పగ్గాలు చేతపట్టుకుని భారతదేశానికి గొప్ప కీర్తి తెచ్చారు. గతంలో సత్య నాదెళ్ల జాబ్, ఆస్తులను గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు బెల్లేవ్‌లోని సత్య నాదెళ్ల ఇంటి గురించి తెలుసుకుందాం.

1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో విఫలమై ఆ తరువాత 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందాడు. విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌.. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA చేశారు.

(ఇదీ చదవండి: బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?)

మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ళ బెల్లేవ్‌లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో రెండు అంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్, పెద్ద అవుట్‌డోర్ డెక్, హాట్ టబ్‌తో సహా అనేక సౌకర్యాలు మాత్రమే కాకుండా వైన్ సెల్లార్ కూడా ఉంది.

ఆధునికమైన, అధునాతన సదుపాయాలు కలిగిన ఈ విలాసవంతమైన ఇంట్లో పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు, అద్భుతమైన బెడ్‌రూమ్‌లు, పెరట్లో కొలను, గేమ్ రూమ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. మొత్తానికి సత్యనాదెళ్ళ ఇల్లు భూలక స్వర్గాన్ని తలపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top