
ఆర్ధిక మాంద్యంలో ఐటీ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా..మైక్రోసాఫ్ట్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఒక లక్షకుపైచిలుకు భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు నెలరోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ చాంపియన్స్ ఆఫ్ కోడ్ కార్యక్రమం కింద నెలరోజుల శిక్షణతోపాటు అభ్యర్థులను ధ్రువీకరించనుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలపర్ కమ్యూనిటీలతో ఆవిష్కరణల కేంద్రంగా భారత్ మారిందని మైక్రోసాఫ్ట్ ఇండియా కస్టమర్ సక్సెస్ ఈడీ అపర్ణ గుప్త అన్నారు. దేశ వృద్ధిని నడిపించే సాంకేతికత అభివృద్ధిలో డెవలపర్ల సృజనాత్మకత, ఆవిష్కరణ, అభిరుచిని మైక్రోసాఫ్ట్ గుర్తిస్తుందని చెప్పారు.