వచ్చే ఏడాదిలో ఎంజీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, రేంజ్‌ ఎంతంటే..

MG Motor to drive in electric vehicle at 10 to 15 lakh by next fiscal - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ(Morris Garages) మోటార్‌ ఇండియా రూ.10–15 లక్షల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ క్రాస్‌ఓవర్‌ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా మార్పులు చెందనుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్‌ ఛాబా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.21 లక్షల నుంచి ప్రారంభంగా తెలుస్తోంది.

చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలకు స్టార్టప్‌ల జోరు! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top