ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్! | Meta Platforms AI Expansion Sparks Fresh Concerns Over Tech Job Cuts, Viral Post Raises Questions, Check More Details | Sakshi
Sakshi News home page

ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!

May 22 2026 9:07 PM | Updated on May 23 2026 9:27 AM

Meta AI Expansion Sparks Fresh Concerns Over Tech Job Cuts

మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్‌లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.

మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.

మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement