soldout: రూ.2.43 కోట్ల కారు.. క్షణాల్లో ఇయర్‌ స్టాక్‌ మొత్తం అమ్ముడైంది

Mercedes Maybach GLS 600 4 MATIC Soldout Year Worth Orders Amid Pandemic - Sakshi

ప్యాండమిక్‌ డేస్‌లో ధనవంతుల జోరు

లగ్జరీ కార్లపై ఇండియన్లలో పెరుగుతున్న మోజు

ముంబై: కరోనా దెబ్బకు కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, మందగిస్తున్న ఆర్థిక గమనం వంటి పరిణామాల నేపథ్యంలో ఓ ఖరీదైన అల్ట్రా లగ్జరీ కారు మార్కెట్‌లోకి వచ్చింది. ఆ కారు ఖరీదు ఎక్స్‌షోరూం ధరనే రూ. 2.43 కోట్ల రూపాయలు. అమ్మకాలు ఎలా అనే సందేహమే లేకుండా క్షణాల్లోనే ఏడాది స్టాక్ అంతా మనవాళ్లు కొనేశారు.  

మెర్సిడెజా మజాకా
లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియాలో తాజాగా మైబెక్‌ జీఎల్‌ఎస్‌ 600  సిరీస్‌లో 4 మాటిక్‌ అల్ట్రామోడ్రన్‌ లగ్జరీ కారును రిలీజ్‌ చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 2.43 కోట్లుగా నిర్ణయించింది. ఇలా లాంఛ్‌ అయ్యిందో లేదో అలా మొత్తం స్టాక్‌ మొత్తం అమ్ముడైపోయి రికార్డు సృష్టించింది.

500 కార్లు సోల్డ్‌ అవుట్‌
ప్రీమియం కేటగిరి లగ్జరీ కారైన మైబెక్‌ జీఎల్‌ఎస్‌ 600 4 మాటిక్‌ లగ్జరీ కారును ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఏడాదిలో 500 కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాంఛింగ్‌కి ముందే మొత్తం కార్లన్నీ బుక్‌ అయిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే బుక్‌ చేసుకున్న వారికి ఈ కార్లు డెలివరీ చేస్తామని ఆ సంస్థ ఈసీవో మార్టిన్‌ ప్రకటించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి : మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top