Reddit Layoffs: ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ కారణాలివే!

laysoffs Reddit reduces nearly 90 employees - Sakshi

ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌  తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు  నిర్ణయించింది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో పునర్నిర్మించే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే  కంపెనీ సుమారు 90 మంది ఉద్యోగులను తొలగిస్తోంది . అంతేకాదు రానున్న సంవత్సరాల్లో హైరింగ్‌ను ప్రణాళికలను వెనక్కి తీసుకుంటోంది. 

 కంపెనీ స్టీవ్ హఫ్ఫ్‌మాన్ ఈ సందేశాన్ని ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్‌లో తెలియజేశారు. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కంపెనీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు .2024 చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించనున్నామనీ, రీస్ట్రక్చర్ నిర్ణయం ఫలితం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఇది ఇకపై కూడా కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేవారు.  (ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ లబోదిబో)

నివేదిక ప్రకారం దాదాపు 5శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది.300 మంది అదనపు ఉద్యోగులను నియమించుకోవాలని భావించింది, కానీ ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి తగ్గించేసినట్టు  సమాచారం.  ప్రస్తుతం కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులున్నారు. 

ఇదీ చదవండి: ఐవోఎస్‌ 17 అదిరిపోయే అప్‌డేట్‌: ఈ పాపులర్‌ ఐఫోన్‌ యూజర్లకు మాత్రం 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top