డిస్నీ ఉద్యోగులకు మరో షాక్‌, మొత్తంగా 7 వేల మంది ఇంటికే!

Layoffs 2023 Disney begins 3rd round of layoffs and more - Sakshi

డిస్నీ:  మూడు రౌండ్లలో లే ఆఫ్స్‌

రెండో రౌండ్‌లో 2500 మందికి  ఉద్వాసన

సాక్షి, ముంబై: ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్‌ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.  ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డజన్ల కొద్దీ  టైటిల్స్‌ను తొలగిస్తోంది. 

నివేదిక ప్రకారం, తీవ్రంగా దెబ్బతిన్న టెలివిజన్ విభాగం, రెండో  రౌండ్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఉద్యోగుల తొలగింపులు,ఇతర వ్యయ-తగ్గింపు చర్యల  ద్వారా  5.5 బిలియన్‌ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను  ఫిబ్రవరిలో ప్రకటించింది.  (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్‌, అందంగా సల్మాన్‌ ఖాన్‌)

కాగా  డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి రౌండ్ లేఆఫ్స్‌ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్‌లో ఏప్రిల్‌లో 4వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో  దాదాపు 7,000 మంది కార్మికులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరు 1 నాటికి, డిస్నీకి 220,000 మంది ఉద్యోగులు ఉన్నారు . (ఫేస్‌బుక్‌ మెటాకు భారీ షాక్‌: ఏకంగా 10వేల కోట్ల జరిమానా)

మరిన్ని ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌, తాజా వార్తల కోసం చదవండి: సాక్షి,బిజినెస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top